6, మే 2010, గురువారం

ammamma saamethalu

ఆ తాను ముక్కే !!!

ఆడ పిల్ల , సిగ్గు బిళ్ళ పలువురి లో కనిపించ రాదూ .

ఆడబోయన తీర్థము ఎదురైనట్లు .

ఆడదాని వయసు మగవాన్ఐ సంపాదన అడగొద్దన్నట్టు .

ఆడద్ఐ సాధించలేనిది లేదు, ముఖ్యంగా మొగుడిని.

ఆడలేక మద్దెల వోడు అన్నట్లు.

ఆది లోనే హంస పాదు.

ఆది తప్ప రాదూ, పలికి బొంక రాదూ.

ఆకాశానికి హద్దే లేదు.

ఆకలి రుచి యెరుగదుఇ, నిద్దుర సుఖం ఎరుగడు, వలపు సిగ్గు ఎరుగడు.

ఆకలి వేస్తే రోకలి మిన్గామన్నాద్త.

ఆయనే ఉంటె తెల్ల చీరతో పనేంటి అని.

ఆకు యెగిరి ముళ్ళు మీద పడ్డ, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా చిరిగేది ఆకే.

ఆలస్యం అమృతం విషం.

ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం.

ఆరే దీపానికి వెలుగు ఎక్కువ.

ఆరోగ్యమే మహాభాగ్యము.

ఆస లావు, పీక సన్నం

ఆస్తి మూరెడు ఆస బారెడు.

ఆత్రాగానికి బుద్ధి మట్టము.

ఆవలింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేదంట.

ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్లు..

ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?

ఆవు గట్టున మేస్తే దూడ పొలాన మేస్తుందా?

ఆయనే వుంటే మంగలి ఎందుకు ? (ఇన్ ఒల్దెన్ డేస్, వొమెన్ హద తో శ్వే తేఇర్ హేఅడ్స్ ఈఫ్ తేఇర్ హస్బెండ్ దీస్, సో "ఈఫ్ హి ఇస్ అలివే, వై నీద అ బర్బెర్")

ఆయనే వుంటే తెల్ల చీర ఎందుకు ?

అబద్ధము ఆడిన అతికినట్లు ఉండాలి.

అబ్యాసము కూసు విద్య.

అచ్చిగాడి పెళ్ళిలో బుచ్చిగాడి కి ఒక జన్ఝాపు పోగు.

ఆడది అనుకుంటే గడపకు తెలీకుండా ధన్తుతుంది

ఆడది అనుకుంటే గడపకు తెలీకుండా దాటుతుంది

అడగన్దేయ్ అమ్మిన అన్నం పెట్టడంత.

అడగనిదే అమ్మైనా పెట్టదు.

ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే.

ఆడవారి నోట్లో ఆవగింజ దగదు

అడవి కాచిన వెన్నెలలా (లికె లైట్ ఇన్ ది జున్గ్లె - ఉసెలెస్స్).

అడవిలో పెళ్ళికి జంతువులే పురోహితులు.

అద్దాలు నాడు బిడ్డలు కాని, గడ్డలు నాడు కాదు.

అద్దం అబద్ధం చెప్పదు.

అద్దం ఎప్పుడు అబధం ఆడదు, ఎలాన్తివదినైనా అందంగా చూపిస్తుంది.

అడిగే వాడికి చెప్పేవాడు లోకువ.

అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు.

అడుక్కునీ వాడికి చెప్పులు కుట్టుకునీ వాడు.

అడుక్కున్నమ్మ కు ౬౦ కూరలత, వండుకున్న అమ్మకు ఒకటే కూరత.

అడుసు తొక్కనేల కాలు కడగనేల.

ఏ ఎండకు ఆ గొడుగు.

ఏమి లేని ఎడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము.

అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంటము.

అగ్నికి ఆజ్యం పోసినట్లు.

అగ్నికి వాయువు తోడైనట్లు.

ఐశ్వర్యము వస్తే అర్థ రాత్రి గొడుగు పట్టమనేవాడు.

అక్క పెళ్లి కుక్క చావుకి వచ్చింది.

ఆకులూ నాక్కునే వాడి దగ్గర మూతులు నాక్కునే వాడట.

అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవలకి వెళ్లి నోట్లో వేసుకున్నాడట.

అంబలి నాకేతోడికి మీసాలేట్టేతోడు ఒకడు.…

అమ్భం లో కుంభం లా.

అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది.

అందని ద్రాక్ష పళ్ళు పుల్లన

అందం అన్నం పెట్టాడు.

అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట.

అందుని ముందు అందాలెల ? (వై ఎక్ష్పొసె బ్యూటీ బెఫోరే అ బ్లింద్ మాన్ ?)

అందితే సిగ అంధక పోతే కాళ్ళు.

అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లు సేని ఉన్నట్లు.

అన్న దానం కంటే విద్య దానం గొప్పది

అన్నం పరబ్రహ్మ స్వరూపం.

అన్నప్రాసన నాదే ఆవకాయ పట్చాది.

అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు.

అన్నీ వున్నా విస్తరాకు అనిగిమనిగి ఉందట..ఏమి లేని విస్తరాకు ఎగిరెగిరి పడ్డాడట…

అన్ని దానములలో విద్య దానం గొప్పది

అన్ని తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే ఏమి తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చింది.

అన్ని వున్నా అల్లుని నోట్లో శని వుంది అన్నట్లు.

అంతట బావే కాని వంగ తోట కాదా కాదు.

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు.

అనుమానం పెనుభూతం.

అప్పిచ్చువాడు వైద్యుడు అంటారు.

అప్పు చేసి పప్పు కూడు.

అర్ధరాత్రి మద్దేలదరువు.

అసలే లేదంటే పెసరపప్పు వందమన్నాదట ఒకడు.

అసలు బాబు కన్నా...గుడ్డి బాబు మేలు అన్నట్టు…

అసలు కంటే వడ్డీ అంటే ప్రీతి అట…

అసలుకే ఎసరు పెట్టినట్లు.

అసమర్తుడికి అవకాసమివ్వనేల ?(వై గివె అ ఛాన్స్ తో ఇనెఫ్ఫికిఎన్త పర్సన్ ?)

అసపోతు బ్రాహ్మడు లేసిపోతూ పప్పు అడిగాడుట.

అతి రహస్యం బట్ట బయలు.

అత్త లేని కోడలుత్తమురాలు, కోడలు లేని అత్తా గుణవంతురాలు.

అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు

అత్త సొమ్ము అల్లుడు దానం.

ఆవగింజంత అబద్ధం ముందు ఐరవతమంతా నిజం కూడా నిలబడదు

అయిన వారికి అరిటాకుల్లో......కాని వారికి కన్చాలల్లో.

అయితే ఆదివారము, కాకుంటే సోమవారము.

అయ్యా వచ్చే వరకు అమావాస్య ఆగుతుంద ?

అయ్యగారి (బ్రహ్మిన్) పిల్లలతో ఆదున్కూన దెబ్బలే, ఆడకున్నా దెబ్బలే.

అయ్యకి లేక అడుక్కు తింటున్తే, కొడుకు వచ్చి కోడి పలావ్ అడిగాడట.

అయ్యవారిని చెయ్యబోతే కోతి అయ్యినట్లు.

బావి లో కప్పలా…

బంతిలో బాలపక్షం.

బతకలేని వాడు బడి పతులత..

బతికున్తే బలుసాకు తినవచ్చు.

బయం లేని కోడి పిట్ట బజాట్లో గుడ్డు పెట్టిందట.

బెల్లం చుట్టూ ఈగల్ల

బెల్లం కొట్టిన రాయిల.

భార్య గుణవతి శత్రు…

భక్తి లేని పూజ పత్రి చేటు.

భరించు వాడు భర్త (The one who can bear is the husband).

బిడ్దోచ్చిన వేల గోద్దోచ్చిన వేల.

బోడి ముండ కి మంగళ హారతి ఒకటి.

బొంకులేన్నే కోడల అంతే - అని అనిపించుకో అత్తగార.. నీకు ఆరు నాకు మూడు అందట.

బూడిదలో పోసిన పన్నీరు.

చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు.

చాప కింద నీరుల.

చావు కబురు చల్ల గ చెప్పినట్టు.

చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు.

చచ్చినవాని కండ్లు చారెడు.

చాచిన వాడి పెళ్ళికి ఒచిన్దే కట్నం.

చద్ది కూడు తిన్నమ్మ మొగుడాకలి ఎరగాడట.

చాదువవేస్తే ఉన్నమతి పోయినది.

చదువు రాణి వాడు వింత పశువు.

చేతకానమ్మకే చేస్టలు ఎక్కువ.

చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు.

చక్కనమ్మ చిక్కినా అందమే, పట్టు చీర మాసినా అందమే

చల్ల కొచ్చి ముంత దాచినట్లు.

చంక లో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా తిరిగడం…

చస్తుంటే సంధ్య మంత్రమన్నాడట ఒకడు…

చెడపకురా, చెడేవు.

చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు.

చెముడా అంటే మొగుడా అన్నట్టు.

చెప్పే వాడికి వినే వాడు లోకువ…

చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరెవన్నీ దొమ్మరి గుడిసె లు.

చెరపకురా చేదేధావు, ఉరకకురా పదేధావు.

చెరువు మీద అలిగి, ఎవడో ముడ్డి కడుక్కోవడం

చెరువుకి నీటి ఆస, నీటికి చెరువు ఆస.

చెట్టు పేరు చెప్పి కాయలమ్ము కున్నట్లు

చెవిలో జోరీగ…

చెవిటి పెద్దమ్మా చాన్తాదేదే అంటే- మా అమ్మ పుట్టిల్లు కోడలి అందంత

చెవిటి వాడి చెవిలో సంఖం ఊదినట్లు.

చేవితోడు పెళ్ళికి, మూగోది కచేరి.

చిల్లర దేవుళ్ళకు చేరువయితే, అసలు దేవుడికి దురమౌతావు.

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి.

చింత చచ్చినా పులుపు చావా లేదు.

చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర టింకరవి ఏమి కాయలని అడుగుతున్ధత.

చిత్తం శివుని పైన, భక్తీ చెప్పుల పైన.

చివికి చివికి గాలివాన అయినట్లు.

చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు…

దాసుని తప్పు దండము తో సరి.

డబ్బేమన్నా చెట్టుకి కాస్తుండా ?

డబ్బెవరికి చేదు ?(మనీ ఇస్ స్వీట్)

డబ్బివ్వని వాడు పడవ ముందు ఎక్కాదట

డబ్బూ పోయే సేని పట్టే.

డబ్బు లేకుండా పడవ మున్దేక్కడం.

డబ్బుకు లోకం దాసోహం.

దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు.

దక్కిందే దక్కుడు.

దమ్మిడి మున్డకు ఏగాని క్షవరం.

దంపినమ్మ కు బొక్కిందే కూలిట.

దన్చినమ్మకి బొక్కిందీ దక్కుడు

దండం దాస గుణం భవేత్.

దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన.

దయ గల (కింద్నెస్స్) మొగుడు తలుపు (డోర్) దగ్గరకు వేసి కొట్టాడట.

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి (మాక్ హే వ్హిలె సన్ షినెస్).

దేముడికి దక్షిణ ఎందుకు వెయ్యాలి అంటే, వుతరం వేస్తె వెళ్ళాడు గనుక.

దేవుడు గుడి లోనే పదిహిలం. బయటకు వస్తే పదలం(ఓల్డ్ ౧/౨క్గ స్తోనే, రాయి)

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు.

దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు.

దిన దిన గండం, దీర్ఘాయిశ్హు.

దొంగ చేతికి తాళాలు ఇట్చినట్లు.

దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి.

దొంగకు తెలు కుట్టినట్లు.

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.

దూరపు కొండలు నునుపు.

దొరికితేనే దొంగలు, దొరక్క పోతే దొరలూ.

దున్నపోతు దున్ని దున్ని చస్తే, మగాడు పొడిచి పొడిచి చస్తాడు (ముళ్ళు కర్రతో).

దున్నపోతు మీద వర్షం కురిసినట్లు.

దురాస దుఖ్ఖము చేటు.

ఎద్దుగా ఏడాది బ్రతికి కంటే...అమ్బోతుగా ఆరు నెలలు బ్రతికితే చాలు.

ఎదురుగుండా ఉన్నవాడే పెళ్ళికొడుకు అందిత…

ఈ రోజుల్లో హాస్యం నవ్వు పలు కన్నా, నవ్వులపాలే ఎక్కువ.

ఈ ఊరుకు ఆ వూరు ఎంత దూరమో, ఆ వూరు నుంచి ఈ వూరు అంతే దూరం.

ఈతకు మించిన లోతే లేదు.

ఎలుగ తోక తెచ్చి ఎన్ని నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని, తెలుపు రాదు.

ఎలుగు బంతి తోలు ఎన్నాళ్ళు ఉతికినా ,నలుపు నలుపేకాని తెలుపు రాదూ

ఎంగిలి చేతితో కాకిని తోలదన్నట్లు (పిసినారి)

ఎన్ని గులబిలో, అన్ని ముళ్ళు.

ఎంత చెట్టుకి అంత గాలి.

ఎర్ర చీర కట్టున్నదల్లా నీ పెళ్ళామే ?

ఎవడి ముడ్డి కింద నీళ్ళు వొస్తే వాడికి తెలుస్తుంది బాద ఏమిటో!

ఎవరికీ వారే యమునా తీరే.

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.


గాడిద సంగీతానికి వొంటే ఆశ్చర్యపడితే, వొంటే అందానికి గాడిద మూర్చ పోయిందట.

గాజుల బేరము భోజనాననికి సరి.

గాలి లో దీపం పెట్టి దేవుడా నీదే భ్రాం అన్నట్టు.

గాలికి పోయే దానిని గుండుకి చుట్టుకున్నట్లు.

గాలికి పోయే వాసనా ని గుడ్డకు కరిపించుకున్నట్టు

గంతకు తగ్గ బొంత.

గతి లేనమ్మకు గంజే పానకము.

గోఅరు చుట్టూ మీద రోఅకలి పోఅటు.

గోచి కి పొడవు గుందారుకి కురస అన్నట్టు" (ఒనె వ్హో దొఎస్న్త బెలొంగ్స్ తో ఎఇతేర్ సైడ్ అఫ్ అం ఇష్యూ. )

గోడ మీద రేపు(ది తోమ్మోర్రౌ, విచ్ విల్ నెవెర్ కం).

గోడ మీది పిల్లి

గోడలకు చెవులుంటాయి

గొడ్డుని చూసి గడ్డెయ్యాలి.

గోముఖ వ్యాఘ్రం.

గొంతెమ్మ కోఅరికలు.

గోర్రేయ్ ఎప్పుడు కాసినీ నమ్ముతుంది

గోతి తో పోయేదానికి గొడ్డలి వాడినట్టు

గ్రుడ్డి కన్నా మెల్ల మేలు.

గ్రుడ్డి ఎద్దు జొన్న చేలో పడినట్లు.

గ్రుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.

గుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే (రెఫెర్స్ తో అన్య్థింగ్ తట్ ఇస్ ఉసెలెస్స్.

గుడ్డోడు వచ్చి గూట్లో పడ్డట్టు.

గుడి మింగే వాడికి నంది పిండిమిరియం.

గుడిని, గుడిలో లింగాన్ని, మింగినట్లు.

గుడ్ల మీద కోడిపెట్ట వలే.

గుమ్భానం గునపం లాంటిది, బయటే వాడుకోవాలి,కడుపులో వుంటే పోట్లు పొడుస్తుంది.

గుమ్మడి కాయల దొంగ అంతే భుజాలు తడుముకొన్నాడట.

గుండమ్మ లండన్ వెళ్లి కూడా ముందల యాపారం పెట్టిందట.

గుఱ్ఱము గ్రుడ్డి దైనా, దానాలో తక్కువ లేదు.

గురువుకు పంగనామాలు పెట్టినట్లు.

గురువును మించిన శిష్యుడు.

ఇల్లు అలగ్గనీ పండగ కాదు

ఇల్లు కలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు కావాలన్నదుట ఒకడు.

ఇల్లు పీకి పందిరెయ్యడం (మకింగ్ థింగ్స్ వరసే)

ఇంట గెలిచి రచ్చ గెలువు.

ఇంట తిని, ఇంటి వాసాలు లేక్ఖపెట్టినట్లు.

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదు.

ఇంటి పేరు కస్తురివారు; ఇంటిలో గబ్బిలాల కంపు.

ఇంటికన్నా గుడి బద్రము.

ఇంట్లో చూరు కింద నీళ్ళు తాగి, బతకోచి చల్ల తాగమని చెప్పుకుంటారు.

ఇంట్లో ఈగల మోట బైట పల్లకి మోట.

ఇస్తే హిరణ్య దానం, ఇవ్వక పోతే కన్య దానం

ఇసుక తక్కెడ పేద తక్కెడ.

జగాదమేట్లోచ్చేర జంగమదేవర అంటే - అన్నం పెట్టవే బొచ్చు ముండ అన్నాట్ట.

జోగి-జోగి రాజుకుంటే రాలేది బూడిదే.

జుట్టు వున్నా అమ్మ ఏ కొప్పి ఐన పెదతడి.

కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు.

కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు.

కాకి ముక్కుకు దొండ పండు.

కాకి పిల్ల కాకికి ముద్దు.

కాకిలా కలకాలం బ్రతికేకన్న, హంసలా ఆరు నెలలు బ్రతికితీ చాలు

కాలం కలిసి రాక పోతే, కర్రే పామై కాటు వేస్తుంది.

కాలికేస్తే మెడకి, మెడకి వేస్తె కాలికి.

కాలు జారితే తీసుకోగలము కాని, నోరు జారితే తీసుకోగలమా!

కాషాయం కట్టిన వాళ్ళందరూ సన్యాసులు కారు, కాషాయం మింగిన వాళ్ళందరికీ కఫం కరగదు.

కాసు ఉంటే మార్గముంటది.

కాయా పండా?

కదా కంచికి చేరడం.

కడుపా! కల్లేపల్లి చేరువ?

కడుపు చిన్చుకున్తే కాళ్ళపై పడ్డట్లు.

కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును.

కలిమి లేములు కావడి కుండలు.

కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు.

కల్యానమొచ్చిన కక్కోచినా ఆగదన్నట్లు

కామానికి కామా పెట్టకపోతే కోమాలోకి పోతారు.

కనకపు సింహాసనమున సునకమును కూర్చున్దబెట్టుట…

కంచే చేను మేసినట్లు.

కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా!

కందకు లేని దురద కత్తి పీత కెందుకు ?

కందకు కత్తి పీత లోకువ.

కందెన వేయని బండికి కావాల్సినంత సంగీతం.

కరవమంతే కప్పకు కోపం, విడవమంతే పాముకు కోపం.

కర్ర ఇచ్చి పళ్ళు రాలకొట్టిచ్చు కోవటం

కస్తే ఫలే..

కట్టే కొట్టే తెచ్చే…

కయ్యానికి కాలు దువ్వడం.

కీడెంచి మేలేన్చామన్నారు.

కింద పడ్డా నాదే పై చేయి అన్నట్లు

కొడితే ఏనుగు కుంభస్థలం మీద కొట్టాలి.

కొంప కొల్లేరు అయ్యింది.

కొనబోతే కొరవి అమ్మబోతే అడవి.

కొండ నాలిక కు మందేస్తే ఉన్న నాలిక ఊదిపోయిన్ధత.

కొండ నాలికకి మందు వేస్తే, ఉన్న నాలిక ఊదినట్లు.

కొందామంటే కొరివి....అమ్ముదామంటే అడివి.

కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు.

కొండంత ఐస్వర్యంకన్న ఆవగింజంత అదృష్టం మేలు

కొండను చూసి కుక్క మొరిగినట్టు (డాగ్ బార్కింగ్ అత మౌన్తైన్స్).

కొండను తొవ్వి యెలుకను పట్టినట్లు.

కొందరికి తమ చిన్నతనం చెప్పుకోవడం చిన్నతనం, గోప్పవాల్లయక చిన్నతనం

కొన్న దగ్గిర కొసరు గాని, కోరిన దగ్గర కొసురా ??

కూచంమ కూడా పెడితే, మాచంమ మాయం చేసిందట.

కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి.

కూసే గాడిద వచ్చి మేసే గాదిదను చెరచిందట.

కూసింత కూతురుంటే అన్నీ మంచం మీదే కూడు.

కూటి కోసం కోటి విద్యలు.

కూటికి పేదైతే కులానికి పేదా ?

కొప్పున్నమ్మ కోటి ముడులు వేస్తుంది.

కొరకరాని కొయ్యలా.

కొరివి తో తల గోక్కోవడం.

కొరివితో తల గోక్కున్నట్లు.

కోతి పుండు బ్రహ్మ రాకశాసి.

కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు.

కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్లు.

కొత్తొక వింత-పాతొక రోత.

కోటి విద్యలు కూటి కొరకే.

కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడ్డదట.

కొత్త భిచ్చగాడు పొద్దు ఎరగడు.

కృషితో నాస్తి దుర్భిక్షం.

క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు

క్షేత్ర మెరిగి విత్తనము, పాత్ర మెరిగి దానము.

కుచే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టింది అట.

కుడుము చేతికిస్తే పండగ అనేవాడు.

కుక్క కాటుకు చెప్పు దెబ్బ.

కుక్క తోక పట్టుకు గోదారి ఈదడం

కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదూ.

కుక్షిలో అక్షరం ముక్క లేదు కానీ..

కుళ్ళు పిల్లకి (ఒరిజినల్ ఇస్... ముండకి) అల్లం పచ్చడి అన్నట్టు.

కున్చమంత కూతురున్తే అన్నీ మంచోలోనే నట.

కుంచెడు గింజల కూలికి పోతే తూమెడు గింజలు దూడ తిని పాయిందట

కుండలో అన్నం కుండలోనీ ఉండాలి, పిల్లాడు మాత్రం దొడ్డుగా (లావుగా) ఉండాలి అందిట

లేని దాత కంటే ఉన్న లోభి నయం.

లంక మేట, గోదారి ఈత .

లేడి కి లేచిందే పరుగు.

లేనివాడి దత్రుత్వము ఉన్నవాడి పిసినారితనము ఒకటీ

లోగుట్టు పెరుమాల్లకు ఎరుక.


మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లు.

మాటలు చూస్తే కోతలు దాటుతాయి.

మాటలు కోతలు దాటుతాయి కాని చేతలు గడప కూడా దాటవు..

మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే కిసకో ఉస్కో అందట.

మగవాడు తిరక్క చేదితేయ్, ఆడది తిరిగి చేదేనంత.

మంచమున్నంత వరకు కాళ్ళు చాచుఖో.

మంచి వాడు, మంచి వాడు అంటే...మంచమెక్కి గంతులేసదుట.

మంచికి పొతే చేదేడురైనట్లు.

మంచిమాతకు మంది అంతా మనవాళ్లే.

మంచోడు మంచోడు అంటే మంచమంత ఎరిగాడు..

మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అయినట్లు.

మందుకి పంపితే మాసకానికి వచాదట.

మనిషి మర్మము, మాని చేవ బయటకు తెలియవు.

మనిషి పేద అయితే మాటకు పేదా??

మనిషికి మాటే అలంకారం.

మనిషికొక మాట-గోద్దుకోక దెబ్బ.

మనిషికొక తెగులు మహిలో వేమ అన్నారు.

మనిశోకటి తలిస్తే, దెఉవుదొకతి తలిచాడట.

మంత్రాలకు చింతకాయలు రాలవు.

మంత్రాలు ఎక్కువ. తుంపర్లు తక్కువ.

మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంతే ఉస్కో అందిట.

మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాల ?

మేక వన్నె పులి.

మెరిసేదంతా బంగారం కాదు.

మెత్తగా ఉంటే మొత్త బుద్ది అయ్యిందట.

మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె!

మొదలు లేదు మొగుడా అంటే, పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట

మొదటికే మోసం

మొదట భోగి, భోగాలేక్కువాయి రోగి, రోగాలు భరిచలేక యోగి.

మొదటి దానికి మొగుడు లేదు కానీ, కడదానికి కల్యనమాట !

మొగుడ్ని తనని మొర పెట్టుకుందిట.

మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు దేప్పినందుకు

మొగుడు సచ్చి పెళ్ళాం ఏడుస్తుంటే లంజగాడువచ్చి రాళ్ళూ వేసదట.

మొహమాటానికి పాయి ముండ గర్భినైన్దంతా.

మొహమాటానికి పోతే కడుపు అయ్యిందట.

మొక్కి వంగనిది మాని వంగునా ?

మొండి వాడు రాజు కన్నా బలవంతుడు…

మూడు పువ్వులు ఆరు కాయలు

మూల విగ్రహానికి లేక ముస్టి ఈతుకుంటుంటే, వుస్తావ విగ్రహాలు వచ్చి ఊరేగింపు ఎప్పుడు ఆనయత.

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు.

మూన్నాళ్ళ ముచ్చట.

మొరటి వాడికి మొగలి పువ్వు ఇస్తే మడిచి ముడ్లో పెట్టుకున్నాడట.

మొరిగే కుక్క కరవదు.

మొసేవానికి తెలుసు కావడి బరువు.

ముడ్డి మీద తంతే మూతి పళ్ళు రాలినట్టు.

ముక్కట్టుకోమంతే బ్రహ్మాది ముక్కు పట్టుకున్నాడట.

ముక్కు మీద కోపం.

ముక్కుకు సూటిగా పోవడం.

ముళ్ళ కంప మీద పడిన గుడ్డలా…

ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి.

ముందా కాదు, ముత్తైదువా కాదు.

ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు.

ముందుకు పోతే గొయ్యి-వెనుకకు పోతే నుయ్యి.

ముందు వచ్చిన చెవుల కంటే ....వెనకొచ్చిన కొమ్ములు వాడి.

ముందుంది ముసళ్ళ పండగ.

ముంజేతి కంకనముకు అద్దము ఎందుకు?

ముసలోడికి దసరా పండగన్నట్లు.

నాలికకు రెండు కంచెలు, కళ్ళకు ఒకటి, చెవులకు కంచే లేదని మరువరాదు.

నారు పోసిన వాడు నీరు పోయాడా ?

నది మీద కోపంతో, ముడ్డి కడుక్కోవటం మనేసదట !

నదిలో మెలికలు, జీవితంలో కష్టాలు తప్పవు.

నడుమంత్రపు సిరి, నరాల మీద పుండు.

నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది.

నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.

నాట్యం చేయవే రంగసాని అంతే నెల వంకర అందట.

నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగవాడిని నమ్మ కూడదు !

నవ్వినా నాప చేనే పండుతుంది.

నవ్వు నాలుగు విధాల చేటు.

నవ్వులు పోయి నువ్వులుతాయి.

నీ చెవులకు రాగి పొగులే అంతే అవీ నీకు లేవే అన్నట్లు.

నీ కంటి పొరలు తొలగించి చూడు, అందరి లోను మంచినే చూడగలవు.

నీ నెత్తి మీద ఏదో ఉంది అంతే అది ఏదో నీ చేత్తోనే తీసెయ్యి అన్నాడట.

నీ ఎడమ చెయ్యి తియ్యి నా పుర్ర చెయ్యి పెడతానన్నాడట ఒకడు…

నీకోడి కూస్తేకని తెల్లవారద ఏంటి.

నీరు పళ్ళ మెరుగు, నిజాము దేముడెరుగు.

నిదానమే ప్రధానం.

నిజం నిలకడ మీద తేలుతుంది.

నిజం నిప్పు లాంటిది.

నిజమైన రంకులడికి నిస్తాలేక్కువ

నిమ్మకు నీరు ఎత్తినట్లు.

నిండా మునిగిన వానికి చలి ఏమిటి ?

నిండు కుండ తొణకదు

నిన్నటి అబధాన్ని, ఇవ్లటి నిజం తో కప్పి పుచలేము

నిప్పు లేన్దేయ్ పొగ రాదంట.

నిప్పు ముట్టనిది చేయి కాలదు.

నూరు గొడ్లు తిన్న రాబందుకైన ఒకటే గాలిపెట్టు.

నూరు గుర్రాలకు అధికారి, ఇంట భార్యకు యందు పూరి.

నోరు మంచిదైతే....ఊరు మంచిది.

నువ్వు ఎక్కాల్సిన రైల్ ఎప్పుడు ఒక జీవితకాలం లేటు, అది దేవుడు నీ జీవితంపై వేసిన వేటు.

నువ్వు మేకని కొంటే, నేను పులిని కొని నీ మేకని చంపిస్తా అన్నాడట.

ఓడ ఎక్కే దాకా ఓడ మల్లన్న....ఓడ దిగిన తరవాత బోడి మల్లన్న అన్నట్టు

ఒక వోరలో రెండు కత్తులు ఇమడవు.

ఒకడికి అదృష్టం కలిసి వొచ్చి స్వర్గానికి వెళ్తే, రంభ ముట్టాయి కూర్చుంది త.

ఒలి (వొలి- ముస్లిమ్స్ లో ఇచే కట్నం లాంటిదనుకుంట) తక్కువని గుడ్డిదాన్ని పెల్లదాడట.

ఒంటి పూట తిన్నమ్మ ఒర్చుకున్తే, మూడు పూతలు తిన్నమ్మ మూర్చ పోయిందట.

ఊళ్ళో పెళ్ళికి అందరూ పెద్దలే.

ఊళ్ళో పెళ్ళికి కుక్కలా హడావుడి.

ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు.

ఊరక రారు మహానుభావులు.

ఊరంతా చుట్టాలు, ఉత్తికట్ట తావు లేదు.

ఊరికి ఒక్క దారి అయితే, ఉడుముకి ఒక్క దారి

ఊరు మొహం గోడలు చెపుతాయి.

ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది.

ఊరుకున్నంత ఉతమం లేదు, బోడి గుండంతా సుఖం లేదు.

ఒట్టు తీసి గట్టున పెట్టు.

పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరా.

పాకి దానితో సరసం కంటే అత్తరు సాయిబు తూ కలహం మేలు.

పాము కాళ్ళు పామున కెరుక.

పానకములో పుడక.

పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్లి మూర వేసిందట.

పాపి చిరాయువు

పచ్చ కామెర్ల వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు.

పదుగురాడు మాట పాడియే చెల్లు.

పక్కలో బల్లెం.

పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే - మంచం కొల్ల ల ముగ్గురు అని రెండు వెళ్ళు చూపించాడట.

పాండవులు సంపాదించిన రాజ్యం కుర్వుల తద్దినానికి సరిపోయిందట.

పందికేమి తెలుసు పన్నీటి విలువ?

పండిత పుత్రా - పరమ సున్ట్ట.

పని లేని కోతి తోక ని తీసుకు వెళ్లి మేకుల మధ్యలో దూర్చిందట, అది రక కొట్టుకుని చివరికి చచ్చిందట.

పనిలేని మంగలోడు పిల్లి తల గోరిగాదంతా.

పప్పులో కాలెసినట్టు…

పరాయి సొమ్ము పాము వంటిది.

పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు.

పరుల సొమ్ము పాము వంటిది.

పట్టా పగలు కాకులు కావు కావు మంటుంటే మొగుడిని కౌగాలించుకుందట.

పట్టిందల్ల బంగారమైనట్లు.

పట్టిపట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్లి చెరిపి వేసుకున్నాడట.

పెదిమ దాటితే పెన్నా దాటును.

పీనాసి వాడి పెళ్ళికి పట్చాది మెతుకులు సమభావనత.

పెళ్లి అంతే నూరేళ్ళ పంట.

పెళ్లి, స్రార్దానికి కూడా ఒకటే మంత్రం చదివాడట.

పెల్లికేముంది తొందర, పని నేర్చుకో ముందర (చొంత్రిబుతెద్ బి రాగోతం రెడ్డి)

పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్లినట్టు.

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు.

పేనుకు పెత్తనమిస్తే తల అంట కొరికిందట.

పెరగుట తరగుట కొరకే.

పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.

పెరుగు తోట కూరలో పెరుగు ఎంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది.

ఫలించే వృక్షానికే రాతి దెబ్బలు అన్నట్లు.

పిచ్చి కోఅతికి తెలు కుట్టినట్లు.

పిచ్చోడి చేతులో రాయిల.

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము.

పిచివడి చేతిలో రాయి...…

పిలవని పేరంటానికి వెళ్ళినట్లు.

పిలిచి పిల్లని ఇస్తానంటే...కులం తక్కువ అన్నాడుట... (మొదెర్న్ వెర్షన్: పిలిచి కాఫీ ఇస్తానంటే పంచదార తక్కువ అయ్యింది అన్నాడుట...)

పిల్లి గడ్డానికి జపాన్ బలదే అన్నట్టు.

పిల్లి కి బిచ్చం వేయదు - (పిసినారి).

పిల్లి సే`లకు ఉట్లు తేఘుతహాయ?

పిల్లికి చెలగాటము, యెలుకకు ప్రాణ సంకటము.

పిల్లికి ఎలుక సాక్ష్యం.

పిండి కొద్ది రొట్టె.

పిట్ట కొంచెము కూత ఘనము.

పోఅరు నష్టము పొందు లాభము.

పోమ్ధికి ఏమి తెలుసు పన్నీతివాసన.

పూసా గుచ్చినట్టు చెప్పడం.

పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు.

పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేధన్నాడట.

పోరు నష్టం, పొందు లాభం

పొరుగింటి పుల్ల కూర రుచి.

పొట్ట కొస్తే అక్షరం ముక్క లేదు అన్నట్లు.

పొట్టి వానికి పుట్టెడు బుద్ధులు.

పోటుగాడు పందిరి వేస్తే పిచికలు వచ్చి కూల దోసాయత.

పౌరుషం పుల్లింగం, సహనం స్త్రీ లింగం

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.

పుండు మీద కారం చల్లినట్లు.

పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు.

పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి

పుస్తకాలలో దొరికేది జ్ఞానం, అనుభవంతో వచెది విజ్ఞానం.

పువ్వు పుట్టగానే పరిమలించును.

రాజు మెత్చ్చినదే రంభ!

రామాయనములో పిడకల వేట.

రాత (నుదుటి రాత) రాళ్ళ పాలు ఐతే, మొగుడు ముండ పాలు అయ్యాడట.

రాజు గారి దివానము లో చాకలోడి పెత్తనము.

రాజు గారి బిడ్డను ఎతుకున్న తప్పే దించిన తప్పే !!

రాజు గారి రెండవ భార్య మంచిది అన్నట్టు…

రాజు గారు తలచు కొంటె దెబ్బలకు కొదువా.…

రాజు పెళ్ళానికి ముస్టి రాత ఎవడు తప్పించా గలదు ?

రాజుని చూసిన కళ్ళకి, మొగుడ్ని చూస్తే, మొత్తుకోవలనిపిన్చిదిత.

రాజునూ చూసిన కన్నులతో ...మొగుడ్ని చూస్తె చులకనలే…

రామాయణం అంతా విని సీత రాముడుకి ఏమౌతుంది అని అడిగాడంట.

రామేశ్వరం వెళ్ళిన సేనేస్వరం వదలనట్లు.

రమ్మన్నారు తిమ్మన్న బంతి కి

ర్యాంకు మొగుడు, బొంకు పెళ్ళాం.

ర్యాంకు నెర్చినమ్మ బొంకు నెరవాడ అన్నట్లు.

రాను రాను రాజు గారి గుర్రం గాసిదయ్యిండానే.

రవి కాంచని చోట కవి గంచునత…

రెడ్డి వచ్చే మొదలు ఆడే.

రెండు పడవల మీద కాలు పెట్టడం.

రోలు వచ్చి మద్దెలతో మొర పెట్టుకుందిట…

రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు.

రౌతు కొద్దీ గుఱ్ఱము.

రుణ సేశము, సేత్రు సేశము ఉంచరాదు.

సంబరాల పెళ్ళికొడుకు సప్తాశ్టం లో కూడా వసంతాలన్నడట.

సంసారం చేద్దామని సప్తసముద్రాలలో స్త్ఞానం చేయా బోతే, ఉప్పుఎక్కువై వున్నది కాస్త ఊడింది.

సంగీతానికి చింతకాయలు రాలుతాయా.

సంకలో పిల్లోడిని ఉంచుకొని ఊరంతా వెతికినట్టు.

సంతోషమే సగం బలం.

సర్వేంద్రియానాం నయనం ప్రధానం.

సత్రం భోజనం మతం నిద్ర.

సీత కస్టాలు సీతవి, పీత కస్తావి పీతవి.

సిగ్గు విడిస్తే శ్రిరంగామే.

సింగడు అద్దంకి పోను పొయ్యాడు రాను వచ్చాడు.

సీత భాధ సీతది, పీత భాధ పీతడి (ఎవేర్యోనే హవె తేఇర్ ఒవ్న్ ప్రొబ్లెంస్)

శివుని ఆజ్ఞ లేఖ చీమైనా కుట్టదు.

సోమరుల మెదడు పిచివల్ల స్వర్గం

సొమ్మొకడిది సోకొకడిది

శుభం పలకరా పెల్లికోడక అంతే పెళ్లి కూతురు ముండ ఎక్కడ చచ్చింది అని అడిగాడట.

శ్వాస ఉండేవరకు ఆస ఉంటుంది.

తులసి వనం లో గంజాయి మొక్క

తడి గుడ్డతో గొంతులు కోసినట్లు.

తల బిరుసుతనం ఎక్కువయితే, ఈ తయాల్ము పనిచేయదు.

తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే!

తా దూర కాంత లేదు మెడకో డోలు.

తా చెడ్డ కోతి వనమెల్లా ఝేరచిన్ధత.

తాడి తనను వాని తల తనను వారు ఉందును.

తాళిబొట్టు బలము వాళ్ళ తలంబ్రాల వరకు బతికాడు.

తాను దూర తావు లేదు గాని, మెడకొక రోలత !

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు.

తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు భేదురునా?

తాతకు దగ్గులు నేర్పుత.

తేలుకు పెత్తనమిస్తే థెల్లవార్లూ కుట్టిందట.

తల్లి పిల్లల అరుగుదల(దిగెస్తిఒన్) చూస్తుంది, తండ్రి పిల్లల పెరుగుదల (గ్రౌథ్ ఇన్ ఎడ్యుకేషన్ ఎత్క్.) చూస్తాడు.

తన కోపమే తన శత్రువు.

తనను మాలిన ధర్మమూ-మొదలు చెడ్డ బేరము.

తంతే గారెల బుట్టలో పడ్డట్లు.

తను చేస్తేయ్ శృంగారం, పరులు చేస్తేయ్ వ్యభిచారం.

తను వలచింది రంభ, తను మునిగింది గంగ.

తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు వోర్వలేనివాడు.

తవుడు తాగే వానికి మీసాలు ఎగపెట్టే వాడు ఒకడు

తీగ లాగితే దొంక అంతా కదిలినట్లు.

తెగేదాక లాగవద్దు.

తేనె పూసిన కట్టి.

తిక్కలోడు తిరనాల్లకు వెళితే ఎక్క దిగా సరిపోయిన్దంత.

తినే ముందు రుచి అడుగకు, వినే ముందు కథ అడుగకు.

తినగ తినగ గారెలు చేదు.

తిండి కోసం బ్రతక్కు, బతకడం కోసం తిను.

తిండికి తిమ్మరాజు ....పనికి పోతరాజు.

తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి.

తిరిగే కళ్ళు, తిట్టే నోరు, ఉరికే ఉండదు

తియ్యటి తేన నిండిన నోటితోనే తేనతీగా కుట్టేది.

తోచీ తోచనమ్మ తోడి కోడలు పుట్టిన్తికేల్లిండానే.

తిక్క మొగుడితో తీర్థం వెళితే తీర్థం అంత తిప్పి తిప్పి కొట్టాడట.

తిల పాపం తల పిడికెడు.

తిమ్మిని బమ్మిని చెయ్యడం.

తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్టు

తుమ్మితే ఊడిపోయే ముక్కులా.

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు.

ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది.

ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి తరమాలి అన్నట్లు.

ఉపకారానికి పోఅతే అపకారమేడురైనట్లు.

ఉరికీ ఉన్న ప్రాణానికి ఉప్పురై రాసుకున్నట్లు.

ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్లు.

ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికేక్కున???

V tho modalayye saamethalu (Telugu saamethalu starting with V)

వాడే ఉంటే విధవ్యం ఎందుకు, గుండు ఎందుకు ?

వాడి నోరు ఒక పాకి దొడ్డి. కాని యెన్ చేస్తాం, రోజు పోద్దునీ అవసరం కదా ?

వాపును చూసి బలము అనుకున్నాడట.

వడ్డించే వాడు మనవాడైతే, ఏ పంక్తి లో వుంటే ఏం ?

వడ్ల గింజలో బియ్యపు గింజ.

వండుకున్న అమ్మ కన్నా దండు కున్న అమ్మ గొప్ప.

వెదకబోయిన తీగ కాలికే తగిలినట్టుగా..(చొంత్రిబుతెద్ బి సాయి రామ్)

వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు.

వెన్నతో పెట్టిన విద్య.

వెర్రి వెయ్యి విధాలు.

వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నట్లు.

వెయ్యి విద్యలు కూతికొసమె

వినాస కాలే విపరీత బుద్ది.

వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే చెప్పే వాడు వేదాంతి త.

వినీ వాడువున్తేయ్, అరవం (తమిళ్) లో హరికధ చెప్పాడట నీలంటివాడు.

విస్వేస్వరుడికి లేక విభూది నాకుతూ ఉంటే, నందీశ్వరుడు వచ్చి 'నాకేది' అని అడిగాడట.

ఏ ఎండకు ఆన్ గొడుగు.

ఏ గాలికి ఆ చాప.

యేకులు పెడితే బుట్టలు చిరుగునా?

ఏ రాయి అయితే ఏమి పళ్ళు ఊదగోట్టుకోడానికి

ఎద్దు పుండు కాకికి ముద్దు.

ఎగిరే గాలిపతనికి దారం ఆధారం.

ఎక్కడైనా భావ కాని వంగ తోట దగ్గర మాత్రము కాదు.

యేకులు మేకులయ్యయత.

ఎలుక తోలును తీసి తేదాది రుద్దిన నలుపు నలుపే కాని తెలుపు కాదే…

ఎండా కాలంలో తిరిగి తిరిగి రెక్కలు పడిపోతున్నాయి బాబూ అనుకుందట ఫ్యాన్.

ఏనుగు బతికినా వెయ్యే, చచ్చిన వెయ్యే.

ఎప్పుడూ ఆడంబరముగా పలికే వాడు అల్పుడు.

ఏట్లో ఎద్దుని (ఒక్ష్) ఉంచి కొమ్ములు బెరమాదినట్లు..

ఎవరు తీసిన గోతిలో వారే పడతారు.

8, ఏప్రిల్ 2010, గురువారం


ఉప్పు
కప్పు రంబు నొక్క పోలికనుండు
చూడ జూడ రుచుల జాడ వేరు
పురుషలందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ


అనగా అనగా రాగామతిసేయుల్చునుండు
తినగా తినగ వేము తీయగనుండు
సాధనములపనులు సమకూరుధరలోన
విశ్వధాబిరామ వినురవేమ


అల్పుడెపుడు పలుకు అడంభారముగాను
సగ్గనుండు పలుకు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ



అలువుగాని చోట అధికులు మనరాదు
కొంచేమున్డుతెల్ల కొదువు కాదు
కొన్చెఅర్థమన్దు కొంచెమై ఉండేద
విశ్వదాభిరామ వినురవేమ


అత్మసుది లేని యాచారమదియేల
బాన్దసుద్ధి లేని పాకమేల
చితసుది లేని శివపూజ నేరథ
విశ్వదాభిరామ వినురవేమ


ఇనుము ఇరిగినేని ఇరుమారు ముమ్మారు
కలిపిఅతకవచ్చు కర్మగాను
మనసు విరిగానేని మనసెట్లు కాదయా
విశ్వదాభిరామ వినురవేమ



అల్ప బుదివాని కధికార మిచిన
దొడ్డవారి నెల్ల తొలగగొట్టు
చెప్పు తినేది కుక్క చెరకు తీపెరగునా
విశ్వదాభిరామ వినురవేమ



వేరుపురుగు చేరు వ్రుక్షంభు చేరచును
చీడపురుగు చేరి చెట్టు చేరచును
కుత్సితుండు చేరి గుణవంతు జేరచురా
విశ్వదాభిరామ వినురవేమ


మేదిపొండు చూడు మేలిమై నుండు
పొట్టవిప్పి చూడు పురుగులుండు
పిరికివాని మదిని బింక మీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ



గంగి గోవు పాలు గంతెడైనాను చాలు
కదివిడైనేమి ఖరము పాలు
భక్తీ కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ


తల్లితండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ


ఎలుక తోలు తెచ్చి ఎన్నలు యుతికినా
నలుపు నలుపే కాని తెలుపుకాదు
కొయ్య బొమ్మ తేచి కొట్టిన బలుకునా
విశ్వదాభిరామ వినురవేమ


విద్యలేని వాడు విద్యాధికుల చెంత
నున్దినంత పండితుండు కాదు
కొలను హంసలకడ గొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ