8, ఏప్రిల్ 2010, గురువారం


ఉప్పు
కప్పు రంబు నొక్క పోలికనుండు
చూడ జూడ రుచుల జాడ వేరు
పురుషలందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ


అనగా అనగా రాగామతిసేయుల్చునుండు
తినగా తినగ వేము తీయగనుండు
సాధనములపనులు సమకూరుధరలోన
విశ్వధాబిరామ వినురవేమ


అల్పుడెపుడు పలుకు అడంభారముగాను
సగ్గనుండు పలుకు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ



అలువుగాని చోట అధికులు మనరాదు
కొంచేమున్డుతెల్ల కొదువు కాదు
కొన్చెఅర్థమన్దు కొంచెమై ఉండేద
విశ్వదాభిరామ వినురవేమ


అత్మసుది లేని యాచారమదియేల
బాన్దసుద్ధి లేని పాకమేల
చితసుది లేని శివపూజ నేరథ
విశ్వదాభిరామ వినురవేమ


ఇనుము ఇరిగినేని ఇరుమారు ముమ్మారు
కలిపిఅతకవచ్చు కర్మగాను
మనసు విరిగానేని మనసెట్లు కాదయా
విశ్వదాభిరామ వినురవేమ



అల్ప బుదివాని కధికార మిచిన
దొడ్డవారి నెల్ల తొలగగొట్టు
చెప్పు తినేది కుక్క చెరకు తీపెరగునా
విశ్వదాభిరామ వినురవేమ



వేరుపురుగు చేరు వ్రుక్షంభు చేరచును
చీడపురుగు చేరి చెట్టు చేరచును
కుత్సితుండు చేరి గుణవంతు జేరచురా
విశ్వదాభిరామ వినురవేమ


మేదిపొండు చూడు మేలిమై నుండు
పొట్టవిప్పి చూడు పురుగులుండు
పిరికివాని మదిని బింక మీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ



గంగి గోవు పాలు గంతెడైనాను చాలు
కదివిడైనేమి ఖరము పాలు
భక్తీ కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ


తల్లితండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ


ఎలుక తోలు తెచ్చి ఎన్నలు యుతికినా
నలుపు నలుపే కాని తెలుపుకాదు
కొయ్య బొమ్మ తేచి కొట్టిన బలుకునా
విశ్వదాభిరామ వినురవేమ


విద్యలేని వాడు విద్యాధికుల చెంత
నున్దినంత పండితుండు కాదు
కొలను హంసలకడ గొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి